నమస్తే.
యీ తరం కధలకి స్వాగతం.
ఇవాళ మనం చెప్పుకునే కథ - ప్రార్థనా ఫలం
ఒక గ్రామం లో విజయ్ అనే అబ్బాయి వుండేవాడు. అతని చిన్నతనం లో జరిగిన ప్రమాదం లో ఒక కాలు విరిగినది. అందువల్ల సరిగ్గా నడవలేక పోయేవాడు. మిగిలిన పిల్లలతో ఆడుకోలేక ఎన్నో అవమానాలు పొందేవాడు. అది చూసి అతని తల్లి తండ్రులు ఎంతో బాధ పడే వారు.
ఒక రోజు విజయ్ తల్లి, సాయిబాబా గుడికి వెళ్లి, పంతులు గారితో బాధ చెప్పుకుంది. అప్పుడు, పంతులుగారు, నలబై రోజులు తెల్లవారు జామున నాలుగు గంటల సమయం లో సాయిబాబా ని ప్రార్ధించ మని చెప్తారు. ఆ నలబై రోజులు పంచదార నిషిద్ధము అని చెప్తారు. తను అలాగే చేస్తా నని బాబా కి మొక్కుకుంది.
విజయ్ తండ్రి ఒక కారు మెకానిక్. చాలి చాలని జీతం తో సంసారాన్ని నడుపు తున్నాడు. ఒక రోజు తన కొడుకుని తలుచుకొని బాధ పడుతున్నాడు. అప్పుడు తన మిత్రుడు వైద్యనాధన్ అనే ఎముకల డాక్టర్ గురించి చెప్పాడు. విజయ్ తండ్రి సంతోషంగా ఆ డాక్టర్ ని కలుసుకోవాలని ఆసుపత్రికి వెళతాడు. అక్కడ డాక్టర్ గారి చిత్రపటం చూస్తాడు. డాక్టర్ గారు మరో పదిరోజుల్లో విదేశాలకి పని మీద వెళుతున్నారని, తిరిగి రావడానికి సమయం పడుతుందని, వైద్యం కి పది వేలు ఖర్చు అవుతుందని అక్కడి వ్యక్తి చెప్పాడు. అది విని విజయ్ తండ్రి ఎంతో దిగులుగా ఇంటికి చేరాడు. విజయ్, తన తల్లి తండ్రులు డాక్టర్ గారి గురించి, పంతులు గారు చెప్పిన సంగతి గురించి మాట్లాడు కోవడం విన్నాడు.
మరుసటి రోజు ఆ దంపతులు, సాయిబాబా మీద నమ్మకం తో పొద్దున్నే లేచి, స్నానం చేసి విజయ్ తో ప్రార్ధించటం మొదలు పెట్టారు. అలా పది రోజులు గడిచిపోయాయి. వాళ్ళు పంచదార వాడడం మానే సారు. టీ లో పంచదార లేకుండ తాగడం అలవాటు చేసుకున్నారు. విజయ్ తండ్రి రాత్రి పగలు తేడా లేకుండా పని చేసి డబ్బులు కూడ బెడుతున్నాడు. రోజు ఏ తెల్లవారు జాముకో ఇంటికి చేరు తున్నాడు. ఆ సమయానికి అతని కోసం విజయ్ తల్లి చెక్కర లేని టీ తయారు చేసేది.
ఇంతలో డాక్టర్ వైద్యనాధన్ విదేశానికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు డాక్టర్ గారు విమానాశ్రయం చేరుకోవటం ఆలస్యం అయింది. తను ఎక్కవలసిన విమానం వెళ్ళిపోయింది. అందుకని మరో విమానం వెక్కటానికి హైదరాబాద్ వెళ్ళటం ఒక్కటే మార్గ మని తోచింది. వెంటనే కారులో హైదరాబాద్ కి పయనమయ్యాడు.
డాక్టర్ గారి కారు విజయ్ ఇంటికి కొంచం దూరం లో ఆగిపోయింది. డాక్టర్ గారు కారు దిగి చాల విసుగ్గా డ్రైవర్ ని ఇంకెంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. అదే సమయానికి, విజయ్ తండ్రి ఇంటికి చేరు తున్నాడు. కొంత దూరం లో డాక్టర్ గారిని చూసి గుర్తు పట్టి వివరం అడిగాడు. తాను మెకానిక్ అని చెప్పి, కారు డ్రైవర్ సహాయం తో కారుని బాగు చేసాడు. డాక్టర్ గారు సంతోషం తో డబ్బులు ఇవ్వ బోతుంటే విజయ్ తండ్రి డబ్బులు వద్దని చెప్పి, దగ్గరలోనే తన ఇల్లు ఉందని, కొంత టీ తాగి వారి ప్రయాణం సాగించామని చెప్పాడు. డాక్టర్ గారు కాదనలేక అతని ఇంటికి చేరాడు.
అప్పుడే విజయ్ సాయిబాబా ని ప్రార్ధించి తండ్రి వద్దకు కుంటుతూ వస్తాడు. తండ్రి, విజయ్ ని డాక్టర్ గారికి పరిచయం చేస్తాడు. ఇంతలో విజయ్ తల్లి టీ తీసుకుని వస్తుంది. చక్కర లేని టీ తాగడం తో డాక్టర్ గారు, విజయ్ తండ్రి ని ఎందుకు చేదు గ వున్నా టీ ని తాగుతున్నారని అడుగుతాడు. అప్పుడు విజయ్ తండ్రి వాళ్ళ ప్రార్థన గురించి చెప్తాడు. అది విని డాక్టర్ గారి మనసు కరుగు తుంది. విజయ్ కాళ్ళని పరీక్షించిన తర్వాత డాక్టర్ గారు ఆ దంపతుల తో విదేశం నుంచి రాగానే విజయ్ కి వైద్యం చేస్తానని చెప్తాడు. అక్కడేయ్ వున్నా సాయిబాబా కి అందరు నమస్కరిస్తారు. విజయ్, అతని తల్లి తండ్రులు ఎంతో సంతోషిస్తారు.
డాక్టర్ గారు విదేశం నుంచి రాగానే విజయ్ వాళ్ళ ఇంటికి తన కారు పంపుతాడు. విజయ్, అతని తల్లి తండ్రులు సాయిబాబా కి నమస్కరించి డాక్టర్ గారి ఆసుపత్రి కి చేరు తారు. డాక్టర్ గారిని కలుసుకొని తమ వద్ద రెండు వేలు మాత్రమే ఉన్నాయని చెప్తారు. దానికి డాక్టర్ గారు విజయ్ వైద్యానికి డబ్బులు తీసుకోను కానీ వైద్యానికి గాను చెక్కర వేసిన టీ ఇవ్వమని చెప్తాడు. విజయ్, అతని తల్లి తండ్రులు నవ్వు కుంటూ తమ ప్రార్థనా ఫలం దక్కిందని సంతోషిస్తారు.
మీ అందరికి కథ నచ్చిందని అనుకుంటున్నాను.
కథ కంచికి మనం ఇంటికి.
సాయి బాబా కి జై.
No comments:
Post a Comment